ప్రపంచంలో 7 ఉత్తమ డ్రింక్స్ ఇవే!

ప్రపంచంలో ఆల్కహాల్‌తో కూడిన డ్రింక్సే ఎక్కువ. ప్రజలు వాటిని తాగేందుకు బాగా అలవాటు పడిపోయారు.

ఆల్కహాల్ లేని ఆరోగ్యాన్ని పెంచే డ్రింక్స్ కొన్ని ఉన్నాయి. వాటిని కూడా ప్రజలు ఇష్టంగా తాగుతున్నారు.

టేస్ట్ అట్లాస్ ఇచ్చిన ర్యాంక్ ప్రకారం ప్రపంచంలో 7 బెస్ట్ డ్రింక్స్ ఏవో తెలుసుకుందాం.

PAPELON CON LIMON: ఇది వెనెజులాలో తాజాదనం తెచ్చే డ్రింక్. దీన్ని చెరకుతో చేస్తారు. ఇందులో నిమ్మరసం పిండుతారు.

LULADA: ఇది కొలంబియా డ్రింక్. దీన్ని లులో పండు గుజ్జులో నీరు, నిమ్మరసం, పంచదార కలిపి చేస్తారు. 

COLADA MORADA: ఇది ఈక్వెడార్‌లో సంప్రదాయ డ్రింక్. మొక్కజొన్న, పండ్లు, బ్రౌన్ షుగర్, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలు కలిపి దీన్ని చేస్తారు.

CEYLON BLACK TEA: శ్రీలంకలోని టీ గార్డెన్లలో చేసే టీ ఇది. ఇది ప్రత్యేకమైన ఘాటు ఫ్లేవర్ కలిగివుంటుంది.

MASALA CHAI: ఇది భారతీయ టీ. ఇందులో సుగంధ ద్రవ్యాలు, పాలు, చక్కెర వేసి అద్భుతంగా చేస్తారు.

MANGO LASSI: ఇది కూడా భారతీయ డ్రింకే. మామిడి రసంలో పెరుగు కలిపి దీన్ని తయారుచేస్తారు.

AGUAS FRESCAS: పండ్లు, నీరు, గింజలు, చక్కెర కలిపి తయారుచేసే మెక్సికో సంప్రదాయ డ్రింక్ ఇది.

ఈ 7 డ్రింక్స్‌లో మీకు ఏది నచ్చింది? ఒకటి కంటే ఎక్కువ నచ్చాయా?