ఇంట్లోనే బెల్ పెప్పర్స్ పెంచుకోండి

బెల్ పెప్పర్స్ చూడటానికి కలర్‌ఫుల్‌గా ఉండటమే కాదు. ఆరోగ్యానికి కూడా మంచివే.

మీరు ఇళ్లలోని కుండీలలో బెల్ పెప్పర్స్ మొక్కలు పెంచుకోవచ్చు. ఎలాగో చూద్దాం.

విత్తనం నుంచి మొక్క వచ్చి, బెల్ పెప్పర్స్ కాయడానికి 8 నుంచి 10 వారాలు పడుతుంది. 

ఈ విత్తనాలు మొలకెత్తడానికీ, మొక్క బలంగా ఉండటానికీ సూర్య కాంతి చాలా అవసరం.

బెల్‌పెప్పర్ విత్తనాలు మొలకెత్తడానికి మట్టి వేడి 21 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ ఉండాలి.

బెల్‌పెప్పర్ విత్తనాన్ని మట్టిలో పావు ఇంచు లోపల నాటాలి. అలాగే విత్తనాల మధ్య దూరం 3 అంగుళాలు ఉండాలి. 

మట్టిలో pH స్థాయి 6.0 నుంచి 6.8 ఉండాలి. ఈ మట్టిలో నీరు స్టాక్ ఉండకుండా చూసుకోవాలి.

మట్టి మరీ తడిగా ఉండకుండా, మరీ పొడిగా ఉండకుండా చూసుకోవాలి. 

మొక్క పెరిగిన తర్వాత కింద ఉండే ఆకులను తొలగించాలి. తద్వారా కొత్త ఆకులు వేగంగా వస్తాయి.

ఈ మొక్కను గాలి బాగా తగిలే ప్రదేశంలో ఉంచాలి. అలాగే చీడపీడలు రాకుండా చూసుకోవాలి.

అన్ని జాగ్రత్తలూ తీసుకుంటే, రంగురంగుల బెల్ పెప్పర్స్‌తో కూడిన మొక్క ఆకట్టుకుంటుంది.