అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో రామ్ లల్లా విగ్రహానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న మతపరమైన వేడుకలు, సంప్రదాయాలతో పూర్తయింది.
పవిత్రోత్సవం పూర్తయిన తర్వాత, రామమందిరానికి సంబంధించిన కంపెనీలు జనవరి 23 ట్రేడింగ్ సెషన్‌పై దృష్టి పెడతాయి. గమనించవలసిన స్టాక్‌లను ఇక్కడ చూడండి.
లార్సెన్ అండ్ టూబ్రో(L&T)..టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్‌తో కలిసి నవంబర్ 16,2020న అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలనే ఆర్డర్‌ను అందుకుంది.
Larsen and Toubro
అయోధ్యలో రెండు కొత్త హోటళ్లు ఏర్పాటు చేస్తామని 'ఇండియన్ హోటల్స్' కంపెనీ ప్రకటించింది.
Indian Hotels
IRCTC అయోధ్యకు ఆస్తా ప్రత్యేక రైలుతో సహా 1000 రైళ్లను నడపాలని యోచిస్తోంది.
IRCTC
మ్యాప్ మై ఇండియా కంపెనీ..భారతీయ సంస్కృతి,వారసత్వానికి అనుబంధాన్ని పెంపొందించే భౌతిక కళాకృతుల శ్రేణి 'ది రామాయణ్ మ్యాప్స్' ప్రారంభించింది.
Map My India
అయోధ్య స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కోసం అలైడ్ డిజిటల్(Allied Digital)కంపెనీని మాస్టర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ (MSI)గా ఎంపిక చేశారు.
Allied Digital
అయోధ్యలోని తేడీ బజార్‌లో ఏకకాలంలో 1000 మంది భక్తులకు ఆతిథ్యం ఇవ్వగలిగేలా రూఫ్‌టాప్ రెస్టారెంట్‌తో మల్టీ-లెవల్ పార్కింగ్ సౌకర్యాన్ని అపోలో సింధూరి(Apollo Sindoori)కంపెనీ నిర్మిస్తోంది.
Apollo Sindoori
అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ అధికారికంగా జెనెసిస్ ఇంటర్నేషనల్ కంపెనీ(Genesys International)యొక్క న్యూ ఇండియా మ్యాప్ ప్లాట్‌ఫారమ్‌ను అయోధ్య యొక్క అధికారిక మ్యాప్‌గా స్వీకరించింది.
Genesys International
పర్వేజ్ కంపెనీకి అయోధ్యలోని బ్రహ్మ కుండ్‌లో టెంట్ సిటీ ఉంది. అయోధ్యలో ఆ కంపెనీకి 30 టెంట్లు,1 రెస్టారెంట్ కూడా ఉన్నాయి.
PRAVEG
సుస్థిర అయోధ్య కోసం UP ప్రభుత్వం చేపట్టిన హరిత విప్లవానికి నాయకత్వం వహించేందుకు Pakka Limited(పక్కా లిమిటెడ్) కంపెనీ అయోధ్య రామమందిర్ ట్రస్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
Pakka Limited