ఈ బ్యాక్టీరియా మనిషిని 48 గంటల్లో చంపేస్తోంది!

జపాన్ ఒక ప్రమాదకరమైన వ్యాధి బారిన పడింది.

ఆ వ్యాధి పేరు స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (STSS).

ఆ వ్యాధి మాంసాన్ని తినే బ్యాక్టీరియా వల్ల వస్తోంది.

ఆ వ్యాధి సోకిన వారు 48 గంటల్లో చనిపోతున్నారు.

వాపు, గొంతునొప్పి, కాళ్ల నొప్పులు, లోబీపీ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఇంకా జ్వరం, చలి, కండరాల నొప్పి, వాంతులు కూడా వస్తున్నాయి.

50 ఏళ్లు దాటిన వారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం కనిపిస్తోంది.

ఈ బ్యాక్టీరియా మహిళలకు మరింత ప్రమాదకరంగా ఉంది.

పీరియడ్స్‌లో వాడే టాంపోన్ల నుంచి ఈ బ్యాక్టీరియా పెరుగుతోంది.

మనిషి శరీరంలోనే జీవించే ఈ బ్యాక్టీరియా.. చర్మవ్యాధులు, గాయాలు, శస్త్రచికిత్సలు జరిగినప్పుడు రక్తనాళాల్లోకి ప్రవేశిస్తోంది.

ఈనెల 2వ తేదీ నాటికి 977 మందికి సోకింది, ఏడాది చివరికి 2,500 మందికి వ్యాపించొచ్చని అంచనా వేశారు.