వేసవిలో AC బిల్లు తగ్గించడానికి 9 చిట్కాలు

వేసవిలో ఏసీలు వాడటం వల్ల కరెంట్ బిల్లులు ఎక్కువ వస్తాయి. అయితే వీటిని కంట్రోల్ చేసే కొన్ని చిట్కాలు ఇప్పుడు చూడండి

రాత్రి సమయంలో మీ ACలో స్లీప్ మోడ్‌ని ఉపయోగించండి. ఇది తక్కువ శక్తిని వినియోగిస్తుంది. తద్వారా అధిక విద్యుత్ బిల్లులు రావు

మీ ACతో పాటుగా సీలింగ్ ఫ్యాన్‌లను కూడా ఆన్ చేయడం వల్ల చల్లటి గాలి గది మొత్తం విస్తరిస్తుంది. ఇది పవర్ సేవ్ చేయడానికి బెస్ట్ టెక్నీక్

కరెంట్ వినియోగాన్ని తగ్గించడానికి మీ ఫిల్టర్‌లను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి లేదా రీ ప్లేస్ చేయండి

రోజులో అత్యంత వేడిగా ఉండే సమయంలో మీ కర్టెన్లు లేదా బ్లైండ్‌లను మూసి ఉంచండి. ఇది AC పూర్తి సామర్థ్యంతో పని చేయడానికి దోహదపడి విద్యుత్ ఆదా చేస్తుంది

స్మార్ట్ థర్మోస్టాట్ మీ ACని రిమోట్‌గా నియంత్రించడానికి, మీ వినియోగం ఆధారంగా షెడ్యూల్‌ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది విద్యుత్ ఆదా చేసే మరో అంశం

రోజులో చల్లగా ఉండే సమయంలో ఎయిర్ కండీషనర్ వాడకుండా కిటికీలు, తలుపులు తెరవండి

తేమ స్థాయిలను తగ్గించడం ద్వారా మీరు అధిక ఉష్ణోగ్రతల వద్ద సుఖంగా ఉండవచ్చు. తద్వారా ACని ఎక్కువగా సెట్ చేసుకోవచ్చు

మీ AC బాగా పాతది అయితే కొత్త మోడల్‌కి అప్‌గ్రేడ్ చేయండి. ఇది మీ విద్యుత్ బిల్లులను తగ్గించేందుకు సాయపడుతుంది