మీరు వాడుతున్న పసుపు మంచిదేనా..?

భారతీయులు వంటల్లో తప్పనిసరిగా వినియోగించే పదార్థం పసుపు.

మార్కెట్లో ఎన్నో రకాల పసుపు బ్రాండ్లు ఉన్నాయి.

వీటిలో ఏది స్వచ్ఛమైనది? ఏది నాసిరకమైనది? అని నిర్ధారించుకోవడం కాస్త సవాలుతో కూడుకున్నది.

పసుపు నాణ్యతను ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం.

పసుపులో కర్కుమిన్ (Curcumin) అనే జీవ క్రియాశీల (బయోయాక్టివ్) పదార్థం ఉంటుంది.

ఈ పదార్థం సహాయంతో పసుపు నాణ్యతను చెక్ చేయవచ్చు.

లేత పసుపు రంగులో ఉండే పసుపులో కర్కుమిన్ 3 శాతం మాత్రమే ఉంటుంది.

అదే కాస్త చిక్కటి (Dark) రంగులో ఉండే పసుపులో ఈ కాంపౌండ్ శాతం 7 వరకు ఉంటుంది.

మెరుగైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రజలు చిక్కటి రంగు కలిగిన పసుపునే వాడాలి.

(Disclaimer: ఈ వ్యాసంలో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు.)