నేరేడు పండ్లు తిన్న తర్వాత ఈ తప్పు అస్సలు చేయకండి.. 

భారతదేశంలో ప్రతి సీజన్‌లో కొన్ని రకాల పండ్లు లభిస్తాయి. 

ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివి. 

అయితే వర్షాకాలంలో నేరేడు పండ్లు (Jamun fruits) మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తాయి. 

అయితే ఆయుర్వేదం ప్రకారం, నేరేడు పండ్లు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 

ముఖ్యంగా వీటిని తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు. 

నేరేడు పండ్లు తిన్న తర్వాత నీళ్లు ఎందుకు తాగకూడదో కారణాలు తెలుసుకోండి.

నేరేడు పండు తిన్న వెంటనే నీళ్లు లేదా పాలు తాగితే అజీర్తి సమస్యలు రావచ్చని ప్రముఖ డాక్టర్ మకరంద్ చెప్పారు.

కొందరికి అతిసారం, విరేచనాలు వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చని తెలిపారు.

నేరేడు పండు తిన్న తర్వాత 30 నుంచి 40 నిమిషాల తర్వాతే వాటర్ తాగడం మంచిదని సలహా ఇస్తున్నారు.

అలాగే, నేరేడు పండ్లు ఎక్కువగా తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు.

వీటిని అతిగా తింటే చర్మంపై దుష్ప్రభావాలు చూపవచ్చు.

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.