AAI Jobs: ఎయిర్‌పోర్ట్ లో ఉద్యోగాలు..
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.
వివిధ విభాగాల్లో మొత్తం 342 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించనుంది.
జూనియర్ అసిస్టెంట్(ఆఫీస్), సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్), ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపింది.
ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టును అనుసరించి డిగ్రీ, బీకాం, ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి.
సీనియర్/ జూనియర్ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్‌కు 27 ఏళ్ల వయస్సు మించరాదు.
నెల వేతనం రూ.40,000-రూ.1,40,000 మధ్య చెల్లిస్తారు.
పోస్టును అనుసరించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్, ఎండ్యూరెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.