మీ పిల్లల ఎత్తు పెంచే సూపర్ ఫుడ్స్..

తమ పిల్లలు ఎదుగుదల బాగా ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువుండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. 

కొంతమంది పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు ఉండరు. వారి పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. 

చిన్నారుల ఎదుగుదల బాగుండాలంటే ఎలాంటి ఆహరం పెట్టాలో తెలుసుకోండి.

బాదం.. రకరకాల పోషకాలు, మినరల్స్ ఉన్న బాదంపప్పును తీసుకోవడం వల్ల పిల్లల ఎత్తు పెరుగుతుంది.

చిలగడదుంప.. చిలగడదుంప ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎత్తును పెంచడానికి సహాయపడుతుంది.

గుడ్లు.. పిల్లలకు క్రమం తప్పకుండా గుడ్లు ఇస్తే, మంచి ఫలితం చూస్తారు.

పెరుగు.. పెరుగు గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రోబయోటిక్ పోషకాలను కలిగి ఉంటుంది. 

చికెన్.. మీ పిల్లలు నాన్‌వెజ్ ఇష్టపడితే.. చికెన్ శరీర ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది

బెర్రీస్.. పిల్లల హైట్ కోసం బెర్రీస్‌ను డైట్‌లో చేర్చండి.

సాల్మన్ ఫిష్.. సాల్మన్ చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది పిల్లల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.