సీతాఫలంతో 12 ఆరోగ్య ప్రయోజనాలు!

సీతాఫలాలు పురుగుమందులతో కాకుండా అడవుల్లో వాటంతట అవే కాస్తాయి. అందువల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

సీతాఫలంలో మన బాడీలోని విషవ్యర్థాల్ని తరిమికొట్టే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మనకు రకరకాల రోగాలు రాకుండా ఉంటాయి.

సీతాఫలాల్లోని విటమిన్ C, పొటాషియం, మెగ్నీషియం వంటివి మన గుండెను కాపాడతాయి.

బీపీ (blood pressure)ని కంట్రోల్ చేసే శక్తి కూడా సీతాఫలాలకు ఉంది. వీటిలోని విటమిన్ A, మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. మన కంటి చూపు కూడా మెరుగవుతుంది. 

మలబద్ధకంతో బాధపడేవారు సీతాఫలం తింటే, జీర్ణక్రియ బాగా అవుతుంది. ఈ ఫలంలోని కాపర్, మలబద్ధకాన్ని తరిమికొడుతుంది. డయేరియాకు చెక్ పెట్టే గుణం సీతాఫలానికి ఉంది.

సీతాఫలంలోని మెగ్నీషియం, మన బాడీలోని వాటర్ లెవెల్స్‌ని క్రమబద్ధీకరిస్తుంది. కీళ్లలోని యాసిడ్స్‌ని బయటకు తరిమేసి, రుమాటిజం, కీళ్లనొప్పులకు చెక్ పెడుతుంది. 

రక్తహీనతతో బాధపడేవారు సీతాఫలం తినాలి. ఎందుకంటే ఇందులో కేలరీలు ఎక్కువ. బరువు పెరగాలంటే కూడా సీతాఫలం చక్కటి పండు. 

ఆస్తమాతో బాధపడేవారు కస్టర్డ్ (సీతాఫలం) తింటే మేలు జరుగుతుంది. ఇందులోని విటమిన్ B6… ఆస్తమాకి చెక్ పెడుతుంది.

గర్భిణీలు కూడా తప్పక తినదగ్గ పండు సీతాఫలం. పిల్లలు పుట్టే సమయంలో నొప్పుల్ని నివారించే గుణం ఈ పండుకి ఉంది.

సీతాఫలం గ్లైసెమిక్ ఇండెక్స్ (glycemic index) 54. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు కూడా సీతాఫలం తినవచ్చు. ఇందులోని డైటరీ ఫైబర్, షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది.

(Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.)