ఈ జీవికి శరీరమంతా గుండెలు..

సాధారణంగా భూమి మీద ఉండే జీవరాశులకు ఒకే గుండె ఉంటుంది.

అయితే కొన్ని జీవులకు మాత్రం ఒకటి కంటే ఎక్కువ హార్ట్స్ ఉంటాయి.

ఆ జీవులేంటో ఇక్కడ తెలుసుకుందాం.

వానపాములు.. వానపాముల్లో ఆర్టిక్ ఆర్చ్స్ గా పిలిచే గుండె వ్యవస్థ ఉంటుంది. 

గుర్రపుడెక్క పీత.. ఒక ప్రధాన గుండెతో పాటు ‘పెరికార్డియల్ సైనసెస్’ అని పిలిచే ఐదు జతల కార్డియాక్ సైనస్‌లు వీటికి ఉంటాయి. 

ఆక్టోపస్‌.. ఆక్టోపస్‌ల్లో ఎన్ని రకాల జాతులు ఉన్నా.. ఒక్కోదాంట్లో మూడు గుండెలు ఉంటాయి. 

స్క్విడ్స్.. స్క్విడ్‌‌లో అనేక రకాల జాతులు ఉంటాయి. అయితే అన్ని జాతుల్లో మూడు గుండెలు ఉంటాయి. 

హాగ్ ఫిష్ సముద్ర అడుగు భాగంలో జీవించే చిన్న జీవి హాగ్ ఫిష్. వీటి శరీరంలో ఐదు గుండెలు ఉంటాయి. 

బొద్దింక.. బొద్దింకలకు శరీరమంతా హృదయాలు ఉంటాయి. 

కటిల్ ఫిష్.. కటిల్ ఫిష్‌లకు కూడా మూడు గుండెలు ఉంటాయి. 

జలగ.. రక్తాన్ని పీల్చే జలగలకు అనేక జతల హృదయాలు ఉంటాయి. శరీరం అన్ని వైపులా జలగలకు గుండెలు ఉంటాయి.