AP Jobs: ఏపీ నుంచి మరో నోటిఫికేషన్..
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 13 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఎంబీబీఎస్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 24లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నియామక ప్రక్రియ చేపట్టింది.
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 250 ఉన్నాయి.
అభ్యర్థుల యొక్క వయస్సు 52 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తు ఫీజు రూ.1000 చెల్లించాలి. రిజర్వ్ డ్ కేటగిరీ వారికి రూ.500 ఉంటుంది.
ఎంబీబీఎస్ మెరిట్, ఇంటర్న్‌షిప్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దీనికి సంబంధించి పూర్తి వివరాలకు https://dme.ap.nic.in/ సందర్శించండి.