Chat Box

ఈ పండ్లు తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది!

శరీరంలో రక్తం తక్కువగా ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి.

రక్తం తక్కువగా ఉంటే రక్తహీనత వచ్చే ప్రమాదముంది.

తగిన జాగ్రత్తలతో రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు.

ముఖ్యంగా కొన్ని రకాల పండ్లు తింటే రక్తహీనతను తరిమికొట్టొచ్చు.

ఆ పండ్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

దానిమ్మ.. దానిమ్మ గింజల్లో ఐరన్, విటమన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.

దానిమ్మ గింజలు తింటే శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.

యాపిల్.. యాపిల్స్ ను తింటే రక్తంలో హిమోగ్లోబిన్, ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది.

జామపండు.. జామపండు రోజూ తీసుకుంటే రక్తకణాల సంఖ్య పెరుగుతుంది.

పుచ్చకాయ.. వేసవిలో ఎక్కువగా దొరికే పుచ్చకాయ తింటే రక్తహీనతకు చెక్ పెట్టొచ్చు.

అరటి పండు.. అరటి పండ్లను రోజూ తింటే రక్త శుద్ది జరుగుతుంది.