APPSC: ఆ నోటిఫికేషన్ రద్దు.. 

ఏపీ రాష్ట్ర సర్వే శాఖకు చెందిన కంప్యూటర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ గ్రేడ్‌  ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ను APPSC రద్దు చేసింది.

ఈ మేరకు తెలియజేస్తూ ప్రకటన జారీ చేసింది.

గతేడాది అక్టోబరు 17న ఈ నోటిఫికేషన్ ను జారీ చేశారు.  

దీని ద్వారా 8 కంప్యూటర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ గ్రేడ్‌ 2 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. 

ఐతే ఈ నోటిఫికేషన్‌లో ఇచ్చిన విద్యార్హతలకు అదనంగా సాంకేతిక విద్యార్హతను చేర్చాలని తాజాగా నిర్ణయించారు. 

దీంతో నోటిఫికేషన్ ను రద్దు చేసినట్లు ప్రకటించారు. 

 అంతే కాకుండా విధుల నిర్వహణ జాబితాలోనూ మార్పులు చేశారు. 

వీటి వివరాలను నోటిఫికేషన్‌లో జతచేసి ఇవ్వాల్సి ఉన్నందున ఎపీపీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.

పూర్తి వివరాలకు https://psc.ap.gov.in వెబ్ సైట్ పరిశీలించవచ్చు.