ఇండియా ఫస్ట్.. పాకిస్తాన్ లాస్ట్

ఆసియా కప్ 2023 క్రికెట్ టోర్నీ త్వరలో ఆరంభం కానుంది.

ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనుంది.

ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటున్నాయి.

గ్రూప్ ‘ఎ’లో భారత్, పాకిస్తాన్, నేపాల్.. గ్రూప్ ‘బి’లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లు బరిలోకి దిగనున్నాయి.

ఇప్పటి వరకు ఆసియా కప్ 15 సార్లు జరిగింది.

అందులో భారత్ అత్యధిక సార్లు చాంపియన్ గా గెలవగా.. పాకిస్తాన్ అతి తక్కువ సార్లు విజేతగా నిలిచింది.

భారత్ 7 పర్యాయాలు (1984, 1988, 1990–91, 1995, 2010, 2016, 2018) విజేతగా నిలిచింది.

శ్రీలంక 6 సార్లు (1986, 1997, 2004, 2008, 2014, 2022) ఆసియా కప్ ను నెగ్గింది.

పాకిస్తాన్ కేవలం 2 సార్లు (2000, 2012) మాత్రమే ఆసియా కప్ చాంపియన్ గా నిలిచింది.

బంగ్లాదేశ్ మూడు సార్లు (2012, 2016, 2018) రన్నరప్ గా నిలిచింది.