ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రజలు సగటున ఏ వయసులో కన్యత్వాన్ని కోల్పోతున్నారో డైలీ స్టార్ పబ్లిష్ చేసిన ఫేస్ ఆఫ్ గ్లోబల్ సెక్స్ రిపోర్ట్ చెబుతోంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
మలేసియాలో సగటున 23 ఏళ్ల వయసులో ప్రజలు కన్యత్వాన్ని కోల్పోతున్నారు. ఇదే అత్యధిక వయసు.
మలేసియా తర్వాత ఇండియా నిలిచింది. ఇక్కడ 22.9 ఏళ్ల వయసులో ప్రజలు వర్జీనిటీ కోల్పోతున్నారు.
మూడో స్థానంలో నిలిచిన చైనాలో ఈ వయసు 22.1 ఏళ్లుగా ఉంది.
నాలుగో స్థానంలో థాయిలాండ్ నిలవగా.. అక్కడ ఈ వయసు 20.5 ఏళ్లుగా ఉంది.
20.2 ఏళ్ల వయసుతో హాంకాంగ్ ఐదో స్థానంలో నిలిచింది.
వియత్నాం, నైజీరియాలో ఇది 19.7 ఏళ్లుగా ఉంది.
జపాన్‌లో 19.4, స్పెయిన్‌లో 19.2, ఇండొనేసియాలో 19.1, పోలాండ్‌లో 19 ఏళ్లుగా ఉంది.
ఇటలీ, తైవాన్‌లో 18.9, రష్యా, మెక్సికో, సౌతాఫ్రికాలో 18.7 ఏళ్లుగా ఉంది.
ఈ లిస్టులో ఐస్‌లాండ్ ప్రజలు అతి తక్కువ వయసైన 15.6 ఏళ్లకే కన్యత్వాన్ని కోల్పోతున్నారు.
ఇది యావరేజ్ లెక్క మాత్రమే. పైగా ఇది అధికారిక రిపోర్ట్ కాదని గమనించగలరు.