Runamafi: రైతులకు భారీ షాక్.. రుణమాఫీ డబ్బులు రానట్లే.. 

బ్యాంకులో ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా ఉన్న ఖాతాలు ఎన్నో ఉన్నాయి.

90 రోజుల వరకు సాధారణ ఖాతాదారులతో పాటు బిజినెస్ చేసేవారు వరుసగా మూడు కిస్తీలు చెల్లించకపోతే ఆ ఖాతాలను ఎన్పీఏ కిందకు వస్తాయి.

ఇలా నమోదైన రైతుల ఖాతాలను పంట రుణమాఫీ నుంచి మినహాయించారు.

జులై 18న మొదటి రుణమాఫీ విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే వీటిలో చాలా మంది రైతులు తమకు రుణమాఫీ నిధులు రాలేదని వ్యవసాయాధికారులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

దీనికి కారణం రుణమాఫీ జరిగిన జాబితాలో ఎన్‌పీఏ ఖాతాలున్న రైతుల పేర్లను తొలగించినట్లు తేలింది.

రైతులు వరుసగా మూడు సంవత్సవరాల వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ నిర్వహించని ఖాతాలను ఎన్పీఏగా ప్రకటించారు.

ఇలా తెలంగాణలో మొత్తం 6.91 లక్షల ఖాతాలు ఎన్పీఏగా నమోదు అయ్యాయి.

తాజా ప్రభుత్వం 2018 డిసెంబరు 12 నుంచి రుణమాఫీ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

అంతకు ముందు తీసుకున్న రుణాలకు వీటిని వర్తించమని కూడా తెలియజేశారు.

అలాంటి ఖాతాలు 10 లక్షలకు పైగా ఉండగా.. అందులో 6 లక్షలకు పైగా ఎన్పీఏలు ఉన్నట్లు తెలుస్తోంది.

జులై చివరినాటికి రెండో విడత రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

ఆగస్టు 15 లోపు మూడో విడత అంటే.. రూ.2 లక్షల రుణ మాఫీ చేయనుండగా.. ఎన్పీఏ ఖాతాలు ఉన్న రైతులకు భారీ షాక్ తగలనుం

వారు ఈ రుణమాఫీ దూరంగా ఉండనున్నారు.