రాత్రి పడుకునే ముందు పాలు తాగుతున్నారా ?
రోజూ పాలు తాగడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని అందరికీ తెలిసిందే.
అయితే రాత్రి పడుకునే ముందు వేడి పాలు తాగొచ్చా లేదా?
పాల వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఎముకలు దృఢంగా ఉంటాయి.
పాలు అలసటను పోగొట్టడానికి , ప్రశాంతంగా గాఢమైన నిద్ర పొందడానికి సహాయపడుతుంది.
పాలలో ఉండే పొటాషియం రక్తపోటును సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
రాత్రి పడుకునే ముందు వేడి పాలు తాగడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
పాలలోని క్యాల్షియం , ప్రొటీన్ పరిమాణం కొవ్వును కాల్చే ప్రక్రియను వేగవంతం చేస్తుంది
పాలలో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది నిద్ర హార్మోన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది.
రాత్రి పడుకోవడానికి గంట ముందు పాలు తాగితే మంచి నిద్ర వస్తుంది.
కాసిన్ ట్రిప్టిక్ హైడ్రోలైజేట్ (CTH) అనేది పాలలోని పెప్టైడ్ల మిశ్రమం. ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.