వర్షాకాలంలో ఇలా చేశారంటే జుట్టుకి హాయి!
సరైన దువ్వెనను ఎంచుకోండి. పెద్ద పళ్లు ఉన్న దువ్వెన మంచిది. అది తడి వెంట్రుకల్ని బాగా విడదీస్తుంది.
పెద్ద దువ్వెన వల్ల జుట్టు చిక్కులు పడకుండా, ఊడిపోకుండా ఉంటుంది.
వారానికి 2 లేదా 3 సార్లు తల స్నానం చెయ్యండి. యాంటీబ్యాక్టీరియల్ షాంపూ వాడండి.
అదనపు చిట్కా - తల స్నానం తర్వాత కండీషనర్ వాడితే, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
వర్షాకాలంలో చిన్న హెయిర్ స్టైల్ మంచిది. అదైతే జుట్టు వర్షంలో పాడవకుండా ఉంటుంది.
పాడైన, చిట్లిన వెంట్రుకల్ని తొలగించేందుకు మీరు, వెంట్రుకల చివర ట్రిమ్ కూడా చేసుకోవచ్చు.
స్నానం తర్వాత జుట్టును మెత్తని టవల్‌తో తుడుస్తూ... జుట్టు పొడిగా ఉండేలా చేసుకోండి.
తల స్నానం తర్వాత జుట్టును వదులుగా ఉంచండి. లేదంటే జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంటుంది.
మీ జుట్టు కఠినమైనది అయితే, హెయిర్ స్పా చేయించుకోవచ్చు. తద్వారా ఆరోగ్యంగా ఉంచవచ్చు.
హెయిర్ స్పా తర్వాత జుట్టు పోషకాలతో, తేమతో, కాంతివంతంగా మారుతుంది.
హెయిర్ స్టైల్ నిపుణులను సంప్రదించి, వారి సలహాలతో ఈ చిట్కాలు పాటించడం మేలు.
More
Stories
వామ్మో.. యాపిల్స్
చెమట దుర్వాసనకు చెక్
పచ్చి క్యారెట్ తింటే..