పొట్టను కరిగించే జ్యూసెస్

ఒక్కసారి పొట్ట పడిందా.. దానిని తగ్గించడం అంత సులభం కాదు.

పొట్టలో కొవ్వు చేరిందంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

ప్రస్తుతం యువకులు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.

అయితే కొన్ని జ్యూసెస్ తాగడం వల్ల పొట్టను తగ్గించుకోవచ్చు.

1. లెమన్ వాటర్ : ఉదయాన్నే లెమన్ వాటర్ ను తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ ను కరిగించొచ్చు. దీనిలో ఉండే విటమిన్ ‘సి’ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

2. గ్రీన్ టీ : గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మెటబాలిజమ్ ను పునరిద్దించడం ద్వారా కేలరీస్ ను ఖర్చు చేయిస్తుంది. దాంతో పొట్ట కొవ్వు తగ్గుతుంది.

3. అల్లం టీ : రోజు అల్లం టీ తాగడం ద్వారా కూడా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు.

4. డిటోక్స్ వాటర్ : శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపాలంటే డిటోక్స్ వాటర్ అత్యుత్తమం.

5. యాపిల్ సైడర్ వెనిగర్ : వెయిట్ లాస్ కు యాపిల్ సైడర్ వెనిగర్ అద్భుతంగా పని చేస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కూడా

వీటితో పాటు రోజు కనీసం ఒక గంట పాటు వాకింగ్ చేయడం ద్వారా బెల్లీ ఫ్యాట్ ను తిగ్గించుకోవచ్చు.

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.)