వర్షాకాలం వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కు రెమిడీ
జలుబు, దగ్గు, జ్వరంతో పాటు ఇటీవల అనేక వ్యాధులు వస్తున్నాయి. ఎక్కువగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రజలను ఇబ్బంది పెడుతోంది.
కాబట్టి వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటో చూద్దాం..
వర్షాకాలంలో మీ పాదాలను ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించుకోవడానికి బయటికి వెళ్లే ముందు మీ పాదాలకు యాంటీ ఫంగల్ పౌడర్‌ను పూయండి.
రాత్రిపూట యాంటీ ఫంగల్ లోషన్ రాయండి. ఇలా చేయడం వల్ల వర్షాకాలంలో పాదాల నుండి దుర్వాసన పోవడమే కాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి పాదాలను కాపాడుతుంది
వర్షాకాలంలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో వేపనూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది.
గోరింటాకు పేస్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మెహందీ ఆకులలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి,
మెహందీ ఆకుల పేస్ట్‌ను మీ పాదాలకు పట్టించి, అది ఆరిపోయే వరకు వదిలి, ఆపై శుభ్రం చేసుకోండి.
టీ ట్రీ ఆయిల్ , పసుపు అనేక ఇన్ఫెక్షన్లకు గొప్ప నివారణలు. టీ ట్రీ ఆయిల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.
ఈ 4 డెంగీ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి..