అరటి పండు ఎప్పుడు తినాలి?

అరటి పండు ప్రతి సీజన్ లోనూ లభిస్తుంది.

అరటి పండులో అనేక పోషక పదార్థాలు ఉన్నాయి.

ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్, విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి.

వీటితో పాటు విటమిన్ బి6, మెగ్నీషియం, కాపర్, మాంగనీసు వంటివి కూడా ఉన్నాయి.

ఉదయం లేవగానే అరటి పండు తింటే అనేక లాభాలు ఉన్నాయి.

1. కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉండటంతో ఉదయాన్నే అరటిపండు తింటే ఆ రోజంతా ఎనర్జటిక్ గా ఉంటారు.

2. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో ఉపయోగపడుతుంది.

3. మెదడు పనితీరు బాగుంటుంది. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ అనే ఆమ్లం కారణంగా మెదడు పనితీరు బాగుంటుంది.

4. గుండెకు మేలు చేస్తుంది. అరటిపండులోని పొటాషియం కారణంగా రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది.

5. అరటి పండులో విటమిన్ ఎ బాగుంటుంది. కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది.

అరటి పండును మధ్యాహ్నం కూడా తినొచ్చు.