ఇంట్లో ఇది ఉంటే, ఇక పుదీనా కొనరు
మనందరం రోజూ పుదీనాను ఇంట్లో వాడుతూ ఉంటాం.
పుదీనాలో సోడియం, పొటాషియం, ప్రోటీన్, విటమిన్ సీ, బీ6, ఐరన్, మెగ్నీషియం ఉంటాయి.
ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. జీర్ణక్రియను పెంచుతుంది.
నోటి, శ్వాస సమస్యల్ని పుదీనా తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ పెంచుతుంది.
బ్రెస్ట్ ఫీడింగ్ పెయిన్‌ను పుదీనా తగ్గిస్తుంది. డిప్రెషన్ పోగొడుతుంది.
పుదీనాను మనం మార్కెట్‌లో కొనే బదులు, ఇంట్లోనే పెంచుకోవచ్చు.
పుదీనా మొక్కలోని బలమైన కాండాన్ని.. మట్టిలో పెడితే, 10 రోజుల్లో అది మొక్క అవుతుంది.
ఎర్రమట్టిలో పుదీనా మొక్క బాగా పెరుగుతుంది. నెల రోజుల్లో గుబురుగా తయారవుతుంది.
పుదీనా మొక్క చిన్నగా ఉన్నా, కుండీ పెద్దగా ఉండాలి. తద్వారా కుండీ అంతా అది విస్తరిస్తుంది.
2 నెలల తర్వాత, ఒకే మొక్క దాదాపు 20 మొక్కలుగా మారుతుంది. బోలెడు పుదీనా వస్తుంది.
ఆకులను మాత్రమే తెంపుతూ, కాడల్ని తెంపకుండా ఉంటే, మీకు ఇక పుదీనా కొరత ఉండదు.
More
Stories
రూ.50,000 పెట్టుబడితో వ్యాపారం
కలలో నీరు కనిపించిందా?
వింత ఖండం?