2028 నాటికి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలివే

వచ్చే నాలుగేళ్లలో ఏయే దేశాలు దూసుకెళ్తాయో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) అంచనా వేసింది.

2028 నాటికి భారత్ పొజిషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని భారతీయులందరికీ ఉంటుంది.

IMF లిస్టులో 43.89 ట్రిలియన్ డాలర్లతో చైనా మొదటి స్థానంలో ఉంటుంది.

32.69 ట్రిలియన్ డాలర్లతో అమెరికా రెండో స్థానంలో ఉంటుంది.

19.65 ట్రిలియన్ డాలర్లతో భారత్ మూడో అతి పెద్ద అర్థిక వ్యవస్థ అవుతుంది.

మూడో స్థానం నుంచి భారత్ రెండో స్థానానికి వెళ్లడం చాలా కష్టం. కారణం అమెరికా చాలా పెద్ద అర్థిక వ్యవస్థ కావడమే.

ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది.

15 నుంచి 35 ఏళ్ల యువత ఎక్కువగా ఉండటం వల్ల భారత్ దూసుకెళ్తోంది.

2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ కోరిక.

భారత్ తర్వాత 7.38 ట్రిలియన్ డాలర్లతో జపాన్ 4వ స్థానంలో ఉండగా, 6.55 ట్రిలియన్ డాలర్లతో జర్మనీ ఐదో స్థానంలో ఉంది.

ఇండొనేసియా, రష్యా, బ్రెజిల్ తర్వాతి స్థానాలను పొందుతున్నాయి.