విషసర్పాలను మెడలో వేసుకుని ఊరేగింపు... ఎక్కడో తెలుసా..?

బీహర్ లోని సమస్తిపూర్ లో ఇప్పటికి భిన్నమైన ఆచారాన్ని పాటిస్తున్నారు..

ఇక్కడ ప్రతిఏడాది నాగ పంచమికి ముందు జాతర నిర్వహిస్తారు..

దీనిలో భాగంగా పాములను మెడలో వేసుకుని నదిలో స్నానం చేస్తారు..

చుట్టు  పక్కల గ్రామస్థులు వందలాదిగా దీనిలో పాల్గొంటారు..

విభూతిపూర్ సింఘియా ఘాట్‌లో కొన్నేళ్లుగా ఈ జాతర జరుగుతుందని సమాచారం.

భగత్ రామ్ సింగ్ మాతా విశ్వ హరి అని పేరు పెట్టుకుని డజన్ల పాములు మెడలోవేసకుంటారు..

ఈ పాములను నోటిలోకి తీసుకుని గంటల తరబడి మెడలో వేసుకుంటుంటారు. 

జాతర ఊరేగింపులో చిన్నాపెద్దా అని తేడాలేకుండా విషసర్పాలను మెడలో వేసుకుంటారు..

స్నానం చేసి పాముకి పాలు, గుడ్డును భక్తితో సమర్పించుకుంటారు.