సెప్టెంబర్‌లో మీ డబ్బుపై ప్రభావం చూపే కొత్త రూల్స్

రూ.2,000 నోట్లు ఉన్నవారు సెప్టెంబర్ 30 లోగా మార్చుకోవాలి

రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి గడువు సెప్టెంబర్ 30 

ఎల్ఐసీ ధన్ వృద్ధి పాలసీ తీసుకోవడానికి సెప్టెంబర్ 30 వరకే అవకాశం

ఆదాయపు పన్ను చెల్లించేవారు రెండో అడ్వాన్స్ ట్యాక్స్ ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించడానికి సెప్టెంబర్ 15 చివరి తేదీ

మేరా బిల్ మేరా అధికార్ పేరుతో సెప్టెంబర్ 1న కొత్త స్కీమ్..దీని ద్వారా లక్కీ డ్రాలో రూ.1 కోటి గెలుచుకోవచ్చు

సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు దాచుకుంటున్నవారు  సెప్టెంబర్ 30 లోగా ఆధార్ నెంబర్ సబ్మిట్ చేయాలి

 వృద్ధులు 1 శాతం వడ్డీ అదనంగా పొందే ఎస్బీఐ వీకేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గడువు సెప్టెంబర్ 30

సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వార్షిక వడ్డీ లభించే ఐడీబీఐ  అమృత్ మహోత్సవ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గడువు సెప్టెంబర్ 30

సెప్టెంబర్ 14 వరకే ఆధార్ కార్డ్ హోల్డర్స్ ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేయొచ్చు