టమాటాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయా?
టమాటా తింటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
టమాటాలను రోజూ కూరల్లో వాడేవారి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయని ప్రచారం జరుగుతోంది.
ఈ వాదన ఎంతవరకు నిజం? ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాల ప్రకారం ఇది నిజం కాదని నిపుణులు అంటున్నారు.
కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ పేరుకుపోయినప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
నిపుణుల ప్రకారం అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే టమాటాలు తింటే, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడవు.
ఉప్పు, మాంసం ఆధారిత ప్రోటీన్లు, ఆక్సలేట్లు అధికంగా ఉన్న ఆహారాల వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడగలవు.
మరేదైనా ఆహారం తీసుకోవడం వల్ల మూత్రంలో రాళ్లు ఏర్పడతాయని ఇంకా రుజువుకాలేదు.
టమాటాలలో విటమిన్ సి, పొటాషియం,
లైకోపీన్
వంటి పోషకాలు ఉంటాయి.
ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులు రాకుండా చేస్తాయి. వీటి వాడకం మంచిదే.
పరిమిత స్థాయిలో టమాటాలను తరచూ కూరల్లో వాడుకోవచ్చు. దానివల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు.
Disclaimer: ఇది సాధారణ సమాచారం. అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి.
More
Stories
శాఖాహారమే శ్రేష్టం
ఏ పాము ఎలాంటిది?
యాపిల్, అల్లం టీ