వేడి ఆహారాలు ఫ్రిజ్‌లో పెట్టొచ్చా?
మనందరి ఇళ్లలో ఫ్రిజ్‌లు కామన్. అవి లేని ఇళ్లు దాదాపు లేవు.
ఫ్రిజ్‌లలో మనం ఆహారాలు, కూరగాయలు, డ్రింక్స్ వంటివి ఉంచుకుంటున్నాం.
బయట కంటే ఫ్రిజ్‌లో ఆహారాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
మరి వేడి పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టొచ్చా అనే డౌట్ మనకు ఉంటుంది.
నిపుణులు మాత్రం వేడి ఆహారాలను ఫ్రిజ్‌లో పెట్టవద్దు అంటున్నారు.
ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్ నుంచి మైనస్ డిగ్రీల వరకూ ఉంటుంది.
ఉష్ణోగ్రతను దృష్టిలో పెట్టుకొని ఫ్రిజ్ కంప్రెసర్ పనిచేస్తూ ఉంటుంది.
వేడి పదార్థాలు ఫ్రిజ్‌లో పెడితే, లోపలి ఉష్ణోగ్రత మారిపోతుంది.
వేడి కారణంగా.. లోపలున్న ఆహార పదార్థాలు త్వరగా పాడవుతాయి.
ఇది దీర్ఘకాలంలో ఫ్రిజ్ పనితీరును దెబ్బతియ్యగలదు.
అందువల్ల వేడి తగ్గిన తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
More
Stories
వట్టి వేర్లతో ప్రయోజనమేంటి?
సెంట్ వల్ల డిప్రెషన్... కొన్ని నమ్మలేని నిజాలు
ఇలా పరుగెడితే..