బాదం, జీడిపప్పు.. ఏది ఎక్కువ ఆరోగ్యకరం

బాదంలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మీ జీర్ణాశయానికి మంచిది.

జీడిపప్పులో ఐరన్, జింక్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి.

గుండె-ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వుల విషయానికి వస్తే, బాదం, జీడిపప్పు రెండూ ప్రయోజనకరమే.

జీడిపప్పుతో పోల్చితే బాదంపప్పులు అధిక కొవ్వును కలిగి ఉంటాయి.

రుచి చూస్తే, బాదంపప్పులు కొద్దిగా వగరుగా ఉంటాయి, జీడిపప్పులు క్రీమీగా ఉంటాయి.

బాదంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్ విటమిన్ ఇ బాగా లభించేవాటిలో బాదం ఒకటి.

జీడిపప్పు, బాదంపప్పులు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ కోసం నియాసిన్, విటమిన్ B-6ని సరఫరా చేస్తాయి.

జీడిపప్పులో అసంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి, ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

బరువు తగ్గడంలో జీడిపప్పు కంటే బాదం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంది.

ధర ప్రకారం చూస్తే, జీడిపప్పు కంటే బాదం రేటెక్కువ. రెండూ తినాలని నిపుణులు సూచిస్తున్నారు.