కొత్త కారు కొనేవారికి కేంద్రం గుడ్ న్యూస్..
మీరు కొత్త కారు లేదా ఏదైనా వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారా?
అయితే మీకో అదిరే శుభవార్త అందించింది కేంద్ర సర్కార్.
కొత్త కారుపై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు.
కొత్త కారు లేదా కమెర్షియల్ వెహికల్ కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ డిస్కౌంట్లు అందించనున్నట్లు కేంద్రం తెలిపింది.
కమెర్షియల్, ప్యాసెంజర్ వెహికల్ తయారీ కంపెనీలు కొత్త వాహనల విక్రయాలపై డిస్కౌంట్ కల్పించేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు.
తమ పాత వాహన్నాన్ని తుక్కుకు సమర్పించిన తర్వాత వారిచ్చిన వాలిడ్ డిపాజిట్ సర్టిఫికేట్ ఉన్నవారికి మాత్రమే కార్ల కంపెనీలు డిస్కౌంట్లు ఇస్తాయన్నారు.
స్క్రాప్ పాలసీకి కంపెనీలు కూడా అంగీకరించినట్లు ఆయన తెలిపారు.
ఢిల్లీలో జరిగిన పరిశ్రమల సమాఖ్యా మండలి సియామ్ (SIAM) సీఈఓల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
నేషనల్ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అనేది వాటాదారులందరికి లాభదాయకంగా ఉంటుందన్నారు.
దక్షిణాసియాలోనే అతిపెద్ద స్క్రాపింగ్ హబ్‌గా భారత్ నిలువనుందని తెలిపారు.
2021 ఆగస్టులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేషనల్ వెహికల్ స్క్రాపింగ్ పాలసీని లాంచ్ చేశారు.
More
Stories
రూ.50వేల పెట్టుబడితో వ్యాపార ఐడియా
యాపిల్స్ ఎక్కువగా తింటే.. ప్రమాదమే!
పుచ్చకాయ రహస్యాలు