Runamafi: రైతులకు మరో గుడ్‌న్యూస్..
మోదీ ప్రభుత్వం 2014 నుంచి కూడా రైతులకు వివిధ రకాల పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తోంది.
పీఎం కిసాన్, ఫసల్ బీమా యోజన లాంటి ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేస్తోంది.
అయితే మూడో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం జులై23 న బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ.. నిధులను భారీగా కేటాయించారు.
అయితే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు రూ.3 లక్షల వరకు తీసుకున్న రుణాలపై వడ్డీ రాయితీని కల్పిస్తోంది.
అయితే ఈ పథకాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం ఆమోదించింది.
ఈ పథకం కింద రైతులు 7 శాతం వడ్డీ రేటుతో రుణం లభిస్తుంది.
సకాలంలో రైతులు రుణం చెల్లిస్తే.. అదనంగా మరో 3 శాతం వడ్డీ రాయితీ అందించబడుతుంది.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణాలను అందిస్తోంది.
ఈ రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో వడ్డీ చెల్లించక పోవడంతో అసలు కంటే కూడా వడ్డీ ఎక్కువగా అవుతోంది.
దీంతో రైతులకు అదనపు భారం పడుతోంది. తీసుకున్న అప్పుకు సకాలం వడ్డీ చెల్లిస్తే.. దీనిలో కేంద్రం నుంచి 4 శాతం రాయితీ లభిస్తుంది.
వాటిని రెన్యూవల్ చేసుకుంటే వెళ్తే.. బ్యాంక్ నిర్ణయించిన వడ్డీ కంటే కూడా చాలా తక్కువ వడ్డీని కట్టవచ్చు.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం