హెల్మెట్ కొంటున్నారా? ఇలా చెయ్యండి!

హెల్మెట్ కొంటున్నారా? ఇలా చెయ్యండి!

టూవీలర్‌పై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి. అది ఎంతో మేలు.

మన బాడీలో అత్యంత ముఖ్యమైనవి ఇంద్రియాలు. వాటిని హెల్మెట్ కాపాడగలదు.

ఇంద్రియాల్లో ఏది దెబ్బతిన్నా, జీవితాంతం బాధపడతాం. అలా జరగకుండా చూసుకోవాలి.

హెల్మెట్ ఇంద్రియాలతోపాటూ, బ్రెయిన్‌కి రక్షణగా నిలుస్తుంది. అందుకే దాన్ని వాడాలి.

టూవీలర్లపై వెళ్లేవారు హెల్మెట్ పెట్టుకోకపోతే, చట్ట ప్రకారం నేరం అవుతుంది. జరిమానా తప్పదు.

హెల్మెట్‌ని స్టైల్ కోసం కాకుండా.. సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని కొనుక్కోవాలి.

హాఫ్ హెల్మెట్ కాకుండా.. పూర్తిగా తలను కప్పివుంచేది వాడాలని నిపుణులు చెబుతున్నారు.

ISI బ్రాండ్‌ మార్క్‌తో, హై క్వాలిటీ ఉన్న హెల్మెట్ కొనుక్కోవాలి.

ఎండ ప్రాంతాల్లో వారు.. లైట్ కలర్స్ ఉన్న హెల్మెట్ ఎంచుకోవాలి.

ఒకరి హెల్మెట్ మరొకరు కాకుండా, ఎవరికి సూట్ అయ్యేది వారు వాడాలి.

ప్రమాదం జరిగినప్పుడు, తలను పూర్తిగా, అన్ని వైపులా కాపాడేలా హెల్మెట్ ఉండాలి.