హార్ట్ పేషెంట్లు సీతాఫలం తినకూడదా?
సీతాఫలంలో ఉండే విటమిన్ A, C, పొటాషియం, మెగ్నీషియం మనకు ఎంతో ఆరోగ్యకరం.
సీతాఫలం తింటే జలుబు చేస్తుందనీ, షుగర్ వ్యాధి వస్తుందనీ రకరకాల అపోహలున్నాయి.
డయాబెటిస్ ఉంటే సీతాఫలం తినకూడదనే వాదన నిజం కాదు. సీతాఫలం గ్లైసెమిక్ ఇండెక్స్ 54 కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నవారూ తినవచ్చు.
గ్లైసెమిక్ ఇండెక్స్ 55, అంతకంటే తక్కువ ఉండే పండ్లను డయాబెటిస్ ఉన్నవారు తినవచ్చు.
హార్ట్ పేషెంట్లు సీతాఫలం తినకూడదనే అపోహ కూడా ఉంది. నిజానికి సీతాఫలం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది.
సీతాఫలంలోని సీ విటమిన్, పొటాషియం, మాంగనీస్ గుండెకు మేలు చేస్తాయి. హార్ట్ పేషెంట్లు కూడా సీతాఫలాన్ని తినవచ్చు.
ఈ పండు తింటే విరేచనాలు అవుతాయనే భ్రమ ఉంది. నిజానికి ఇది జీర్ణవ్యవస్థను సరిచేస్తుంది. మలబద్ధకం, విరేచనాల్ని తగ్గిస్తుంది.
కడుపులో అల్సర్లు, ఏసీడీటీ వంటి వాటిని ఈ పండు తగ్గిస్తుంది. అధిక బరువు ఉన్నవారు కూడా సీతాఫలాన్ని సంతోషంగా తినవచ్చు.
PCOD ఉన్న మహిళలు తినకూడదనే ప్రచారం ఉంది. PCOD ఉన్న మహిళలు కూడా సీతాఫలాన్ని తినవచ్చు.
సీతాఫలంలోని ఐరన్ మహిళల్లో సంతాన సాఫల్యతను పెంచుతుంది. అలసట, నీరసం, గాయాలు, దురదల్ని తగ్గిస్తుంది.
అన్ని వయసులవారూ సీతాఫలం తినవచ్చు. స్కిన్ టోన్, కంటిచూపు మెరుగవుతాయి, జుట్టు బలపడుతుంది, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది.
సీతాఫలం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అధికబరువు, డయాబెటిస్, క్యాన్సర్‌తో ఈ పండ్లు పోరాడతాయి.
More
Stories
పెప్పర్ చికెన్ కర్రీ తయారీ
చలికాలంలో విటమిన్ డీని ఇలా పొందండి
పెదవులకు రక్షణ కోసం!