హోలీకి ఇంటిని 10 విధాలుగా డెకరేట్ చేసుకోండి

మన దేశ ప్రజలు కలర్స్‌ని ఇష్టపడతారు. మనకు ప్రతీదీ కలర్‌ఫుల్‌గా ఉండాలి. అందుకే హోలీ మనకు ఎంతో ప్రత్యేకం.

మీరు పర్యావరణానికి హాని చెయ్యని రంగుల ముగ్గులు వేసుకోండి. పూల రేకలు, బియ్యం పిండితో వేసుకోవచ్చు.

ఇంటి డోర్లు, కిటికీలను పూల దండలతో డెకరేట్ చెయ్యండి. మెట్లపై పూలను ఉంచితే, పరిమళాలు వెదజల్లుతాయి.

డోర్లు, సీలింగ్, చెట్లకు రంగురంగుల కర్టెన్లు వేలాడదియ్యండి. ఇవి మీ ఇంటిని మరింత కలర్‌ఫుల్ చేస్తాయి.

ఇంట్లోని కుండలు, పింగాణీ పాత్రలకు కలర్ పెయింట్స్ వెయ్యండి. ఇవి అదనపు ఆకర్షణ ఇస్తాయి.

ఇంటి ముందు లాంతర్లు వేలాడదీస్తే, అవి మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి. 

రకరకాల షేప్‌లు, సైజుల్లో, రంగుల పేపర్ చైన్స్, టిష్యూ పేపర్స్, ఫ్యాబ్రిక్ చేస్తే, అవి ప్రత్యేకంగా కనిపిస్తాయి.

ఇంటి లోపల అంతటా బెలూన్స్ ఏర్పాటు చేస్తే, అవి గాలికి ఊగుతూ ఆకట్టుకుంటాయి.

గోడలపై మీకు నచ్చిన చిన్న చిన్న కీచైన్ల లాంటి వస్తువులను వేలాడదియ్యవచ్చు. ఇవి వైవిధ్యంగా ఉంటాయి.

ఇంటి డైనింగ్ టేబుల్‌ని కూడా సరికొత్తగా కలర్‌ఫుల్‌గా మార్చండి. కొత్త టేబుల్ క్లాత్స్, నాప్కిన్స వంటివి పండుగ శోభ తెస్తాయి.

ఇవన్నీ చేస్తూనే, ఇంట్లో పాత వస్తువులను తొలగించడం ద్వారా.. కొత్తదనం కనిపిస్తుంది.