నానబెట్టిన వేరుశనగలు తింటూ ఇన్ని రోగాలకు దూరంగా ఉండొచ్చు..

వేరుశనగపప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే ప్రస్తుత చలి కాలంలో మన శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది

ఇది మన ఆకలిని నియంత్రించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

వేరుశనగను నీటిలో నానబెట్టి తినడం ద్వారా మనకు ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు , ఖనిజాలు లభిస్తాయి.

వేరుశెనగ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది

ఇందులో ఉండే మోనో అన్‌శాచురేటెడ్ , పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు మన శరీరంలోని చెడు కొవ్వులను కరిగించడంలో సహాయపడతాయి

వేరుశెనగలో క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, అవి చాలా కాలం పాటు ఆకలిని అరికట్టడంతోపాటు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి.

దీంతో మనం ఇతర ఆహార పదార్థాలను తీసుకోవడం తగ్గుతుంది. ఫలితంగా శరీర బరువు అదుపులో ఉంటుంది.

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాల జాబితాలో వేరుశెనగ కూడా ఉంది.

దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర సమతుల్యంగా ఉంటుంది.

నియాసిన్ ,ఫోలేట్ వంటి పోషకాలు వేరుశెనగలో ఉంటాయి. అవి మన మెదడు పనితీరును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

కండరాలను బలపరుస్తుంది: వేరుశెనగ మన కండరాలను బలోపేతం చేయడానికి, టోన్ చేయడానికి సహకరిస్తాయి