నాగచైతన్యకు అమ్మగా, లవర్‌గా, ఫ్రెండ్‌గా నటించిన బ్యూటీ ఎవరో తెలుసా..?
అక్కినేని లెగసీని నాగార్జున తర్వాత అదే ఫ్లోలో కంటిన్యూ చేస్తున్నాడు నాగ చైతన్య.
మరీ వందల కోట్లు కొల్లగొట్టే సినిమాలే చేయలేదు కానీ.. నాగచైతన్య సినిమాలు బావుంటాయిరా.. అనే స్
థాయి మాత్రం సంపాదించుకున్నాడు.
అంతేకాకుండా టైర్2 హీరోల్లో టాప్ ప్లేస్‌లలో నాగ చైతన్య కూడా ఉంటాడు.
ప్రస్తుతం నాగ చైతన్య తన కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తండేల్ సినిమా చేస్తున్నాడు. ఈ సిని
మా బడ్జెట్ అక్షరాలు రూ.75 కోట్లు.
అన్ని అనుకున్నట్లుగా కుదిరితే.. ఇదే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తు
న్నారు.
సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను కార్తికేయ ఫేమ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున
్నాడు.
ఇక ఇదిలా ఉంటే నాగ చైతన్యతో ఓ హీరోయిన్ తల్లిగా, ఫ్రెండ్‌గా, లవర్‌గా నటించిందన్న విషయం మీకు
తెలుసా..?
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా.. తనే మెగా ప్రిన్స్ భార్య లావణ్య త్రిపాఠి.
ఈ బ్యూటీ నాగ చైతన్యతో యుద్ధంశరణం సినిమాలో లవర్‌గా నటించింది.
అదే విధంగా మనం సినిమాలో ఫ్రెండ్‌గా రెండు, మూడు నిమిషాల పాటు కనిపించే రోల్ చేసింది.
ఇక బంగార్రాజు సినిమాలో నాగార్జున, లావణ్య త్రిపాఠికి కలిగిన సంతానంగా నాగ చైతన్యను చూపించారు.
More
Stories
లిచీ పండ్లు ఎక్కువగా తింటున్నారా
కమ్మని పెరుగు కావాలా?
బరువు తగ్గాలంటే..