సైక్లింగ్ ఇలాచేస్తే.. ఎంతో ఆరోగ్యం!

నైన్టీస్ కిడ్స్ సైకిల్స్ ఎక్కువగా తొక్కేవారు, అది వారికి బైక్‌తో సమానం.

స్కూల్, కాలేజీ, ఎక్కడికి వెళ్లినా సైకిల్ తొక్కుతూ వెళ్లిపోయేవారు.

అది వారికి మంచి ఎక్సర్‌సైజ్ లాగా ఉండేది, బరువు పెరిగేవారు కాదు.

ఇప్పుడు సీన్ మారింది. ఇప్పటి కిడ్స్ బైక్స్, స్కూటీలు నడుపుతున్నారు.

సైకిల్ తొక్కకపోవడం అంటే, ఎక్సర్‌సైజ్‌కి దూరం అవ్వడమే అనుకోవచ్చు.

క్రమంగా బరువు పెరిగి, అధిక బరువుతో ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది.

చక్కని ఆరోగ్యం కావాలంటే రోజూ 20 నిమిషాలైనా సైక్లింగ్ చెయ్యాలట!

ఇలాచేస్తే బాడీలో కొవ్వు కరిగి, ఫిట్‌గా ఉంటారని నిపుణులు అంటున్నారు.

సైక్లింగ్ వల్ల గంటకు 300 కేలరీలు కరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఎముకలు, మోకాళ్ల కండరాల బలానికి కూడా సైక్లింగ్ మంచిదంటున్నారు.

సైక్లింగ్ వల్ల బ్లడ్ ఫ్లో బాగుంటుంది. గుండెకు మేలు జరుగుతుంది.