చేపలు నిద్రపోతాయా?
చేపలు స్థిరంగా ఉండవు. నిరంతరం కదులుతూనే ఉంటాయి.
స్థిరంగా ఉండవు కాబట్టి.. అవి నిద్రపోవు అని మనం అనుకోవడం సహజం
నిజానికి చేపలు కూడా నిద్రపోతాయి. వాటికికనురెప్పలు ఉండవు కాబట్టి.. నిద్రపోతున్నట్లు కనిపించవు.
ప్రతి చేపా, ప్రతి రోజూ ఎంతో కొంత సేపు నిద్రపోతుంది.
కొన్ని చేపలు పగటివేళ నిద్రిస్తే, మరికొన్ని రాత్రివేళల్లో నిద్రిస్తాయి.
నిద్రపోయేముందు చేపలు, సముద్ర లోతుల్లోని పగడపు దిబ్బల్లోకి వెళ్తాయి.
తమ చుట్టూ బంకమన్నులాంటి పదార్థాన్ని పూతగా పూసుకుంటాయి.
అందువల్ల ఇతర శత్రు ప్రాణులు ఆ చేపల్ని కనిపెట్టడం కష్టం.
చేపలకు గాఢనిద్ర ఉండదు. నిద్రపోతున్నా.. పూర్తిగా స్పృహను కోల్పోవు.
చేపలు నిద్రలో ఉన్నా.. నీటిలో నెమ్మదిగా ఈదుతూనే ఉంటాయి.
ఇది కూడా చదవండి: వర్షానికి ముందు మేఘాలు ఎందుకు నల్లగా ఉంటాయి?