పితృపక్షంలో ఇవి కొనకండి..

పితృపక్షం అంటేనే చనిపోయిన మన పెద్దల కోసం కేటాయించిన ప్రత్యేక రోజులు. ఈరోజుల్లో మరణించిన మనపెద్దవాళ్లు భూమిపైకి వచ్చి వారి సంతానాన్ని ఆశీర్వదిస్తారని అంటారు.

అందుకే ఈ సమయంలో ఏవైనా కొత్తవస్తువులు కొనడం శ్రేయస్కరం కాదని చెబుతారు.కాశీకి చెందిన ఆస్ట్రాలజర్ చక్రపాణీ దీని గురించి మరింత వివరణ ఇచ్చారు.

 ఈ సమయంలో పెళ్లి, నిశ్చితార్థం, ఉపనయనం వంటివి కూడా విరుద్ధం అని చెప్పారు. కొత్త బట్టలు కూడా ఈ సమయంలో కొనకూడదట.

ఎందుకంటే ఆ పక్షం రోజులు కొత్తబట్టలు మన పితరుల పేరుమీద దానంగా ఇస్తాం.  పితృలను సంతృప్తిపరచకుంటే కూడా జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. ఆరోగ్య, ఆర్థిక సమస్యలు వస్తాయి.

ఈ సమయంలో ఏ కొత్త వస్తువు కొంటే అది చనిపోయిన పితరులకు కొన్నట్లేనని భావిస్తారు. అందుకే పితృపక్షంలో కొత్త వస్తువులు కొనకూడదు అని చక్రపాణి భట్ తెలిపారు.

పితృపక్షంలో పిండదానం, తర్పణం, శ్రాద్ధం తప్పకుండా తమ పితరుల కోసం నిర్వహించాలన్నారు. దీంతో వారి ఆత్మ శాంతిస్తుందన్నారు.

ఎవరైతే ఈ సమయంలో విరుద్ధంగా ప్రవర్తిస్తారో వారికి పితరుల కర్మ అనుభవించాల్సి ఉంటుంది.  పితృదోషం కలుగుతుంది.

పితృపక్షంలో కేవలం బట్టలు కొనడమే విరుద్ధం అని కొత్త ఇల్లు, ప్లాటు, కారు వంటివి కొనుగోలు చేసుకోవచ్చని అన్నారు.

పితరులను సంతోషపెట్టి మనం ఏ చేసినా వారి ఆశీర్వాదాలు మనపై ఎల్లవేళలా ఉంటాయంటున్నారు జోతిష్కలు. కానీ, చాలామంది పెద్దవారు కూడా  ఈ పక్షం రోజులు ఏం కొనకూడదు అని సలహా ఇస్తారు.