ఈ ఆహారాల్ని పాలతో తీసుకోవద్దు.. విషంతో సమానం
మనం ప్రతి రోజూ పాలు తాగుతాం. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి, అవసరం కూడా.
పాలలో చాలా పోషకాలు ఉంటాయి. దంతాలు, ఎముకలు బలంగా ఉండేందుకు పాలు తప్పనిసరి.
కొన్ని రకాల ఆహారాలతో పాలను కలిపి తీసుకోకూడదు. అలా తీసుకుంటే అజీర్ణ సమస్యలు వస్తాయి.
పాలు, గుడ్లను కలిపి తినకూడదు. గ్యాస్ వచ్చి, పొట్టలో బరువుగా ఉంటుంది. సరిగా జీర్ణం కావు.
మటన్లో ప్రోటీన్ ఎక్కువ. పాలు, మటన్ కలిపి తింటే, శరీర ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది.
చేపల్లో కూడా ప్రోటీన్ ఎక్కువే. పాలతో తినకూడదు. తింటే, ఈ రెండూ కడుపులో గడబిడ సృష్టిస్తాయి.
పాలు, పుల్లటి పండ్ల రసాలు కడుపులో తేడా చేస్తాయి. పండ్లలో యాసిడ్ వల్ల కడుపు ఉబ్బరం రావచ్చు.
పాలు, పెరుగు కలిపి తినకూడదు. దీని వల్ల తీవ్రమైన అజీర్ణ సమస్యలు వస్తాయి.
చాలా మంది పాలలో అరటిని వేసి తింటారు. అవి త్వరగా అరగవు. కడుపులో ఇబ్బందిగా ఉంటుంది.
మసాలా ఆహారంతో పొట్టలో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. పాలు కలిస్తే, అజీర్ణ సమస్యలు తప్పవు.
పాలను తీసుకునేటప్పుడు.. దానికి ముందు, తర్వాత తీసుకునే ఆహారంపై జాగ్రత్తలు పాటించాలి.
More
Stories
మీరు పడుకునే విధానాన్ని బట్టీ మీ పర్సనాల్టీ ఇదీ..!
ఈ రాశుల వారికి అహంకారం. గొప్పలు చెప్పుకుంటారు
ఆలూ చిట్కా