గార్డెన్‌లో ఈ 12 పొరపాట్లు అస్సలు చెయ్యకండి!

అతిగా నీరు పొయ్యవద్దు. నీరు ఎక్కువైతే, వేళ్లు కుళ్లిపోతాయి. మట్టి తేమగా ఉంటే చాలు.

తక్కువ నీరు పోసినా సమస్యే. ఏ మొక్కకు ఎంత నీరు కావాలో అంత కచ్చితంగా పొయ్యాలి.

రోజుకి ఒకసారి నీరు పొయ్యవచ్చు. సమ్మర్‌లో ఉదయం, సాయంత్రం పొయ్యాలి. 

మట్టిలో పోషకాలు తగ్గకుండా చూసుకోవాలి. ఇందుకోసం వర్మీ కంపోస్ట్ వాడొచ్చు.

కుండీలో 30 సెంటీమీటర్ల లోతు వరకూ మట్టి ఉండాలి. అందులో వర్మీ కంపోస్ట్ కూడా కలపాలి. 

ఏ మొక్కకు ఎండ కావాలో దాన్ని కచ్చితంగా ఎండలో ఉంచాలి. మొక్కల మధ్య గ్యాప్ ఉంటేనే, అవి బాగా పెరుగుతాయి.

మీ గార్డెన్, మట్టి ఎలాంటిదో చూసి, అందుకు తగిన మొక్కలు ఎంచుకోండి. బాగా పెరిగే వాటికి ఎక్కువ స్పేస్ ఉంచండి.

మీ ఇంటి చుట్టూ ఉండే వాతావరణానికి సెట్ అయ్యే మొక్కలు ఎంచుకోవాలి. అలాంటివి అక్కడ బాగా పెరుగుతాయి.

మొక్కలపై పురుగులు లేకుండా చూసుకోవాలి. నిరంతరం గమనిస్తూ ఉండాలి. ఆకులకు కన్నాలు పడితే అలర్ట్ అవ్వాలి.

అతిగా పురుగు మందులు వాడొద్దు. అవి వేళ్లను దెబ్బతీస్తాయి. మట్టిలో pH స్థాయి దెబ్బతినగలదు.

ప్రూనింగ్ మంచిదే గానీ.. సీజన్‌ని బట్టీ అది ఉండాలి. సమ్మర్‌లో ప్రూనింగ్ చేస్తే, మొక్క ఎదుగుదల తగ్గిపోగలదు.