మనం రోజు తీసుకునే ఈ ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ వేడిచేయవద్దు!

ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో మనం ఎక్కువగా మళ్లీ వేడి చేసుకుని తింటున్నాం.

అంటే.. ప్రొద్దున వండిని ఒక కూరను.. రాత్రి తినే ముందు వేడి చేసుకుని తింటుంటారు.

అలా చేస్తే యమ డేంజర్. ఒక్క సారి ఆల్రెడీ వండిన కూరను, ఆహారాలను మళ్లీ వేడి చేయడం వల్ల విష పదార్థం అవుతుంది.

అయితే ఇది అన్ని ఆహారాలకు వర్తించదు.

కొన్ని పర్టిక్యులర్‌ ఆహారాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ వేడి చేసుకోకుడదు.

అలా అస్సలు వేడి చేసి తీసుకోకూడని వాటిలో టీ ఒకటి.

అవును మనం రోజు తాగే ఈ టీని ఒక్కసారి మాత్రమే మరిగించుకోవాలి.

స్నానానికి వెళ్లొచ్చాక తాగుతా.. అప్పుడు మళ్లీ వేడి చేద్దువులే.. ఈ మాట నిత్యం మనం అంటూనే ఉంటాం.

కానీ ఎట్టి పరిస్థితుల్లో టీని మళ్లీ వేడి చేసి తాగకూడదు.

మళ్లీ మళ్లీ వేడి చేసిన టీలో పోషక విలువలు బాగా తగ్గిపోతాయి. తద్వారా దాని వల్ల ఏమి ఉపయోగం ఉండదు. 

కాబట్టి టీని వేడి చేసుకుని తాగక పోవడమే బెటర్.