వినాయక నిమజ్జనం ఇలా చేస్తే 100 శాతం పూజాఫలం!

బాధ్రపద మాసం వినాయక చతుర్థినాడు ప్రతిష్ఠాపన చేసుకున్న విఘ్నేశ్వరుడికి ప్రతిరోజూ ధూపదీపనైవేద్యాలను అందించాలి.

గణపతిని మూడు లేదా 5 లేదా 9, 11 రోజులు వారికి వీలైన విధంగా పెట్టుకుంటారు. ఒక్కరోజు పెట్టుకుని నిమజ్జనం చేసేవారు కూడా ఉన్నారు. కేవలం బేసి సంఖ్యంలో మాత్రమే నిమజ్జనం చేస్తారు.

అలాగే విమజ్జనం చేసే రోజు కూడా ఉదయం, సాయంత్రం రెండు పూటలా పూజలు చేసి, తీర్థాప్రసాదాలు ఇంట్లో ఉన్న అందరూ తీసుకోవాలి.

‘యధాస్థానం ప్రవేశయామి.. పూజార్థం పునరాగమనాయచ’ అనే మంత్రాన్ని చదువుతూ విగ్రహానికి ఉద్వాసన పలకాలి.

దీని అర్థం ‘స్వామి నీ స్వస్థలానికి వెళ్లి మళ్లీ పూజకు మమ్మల్ని అనుగ్రహించు’ . ఆ తర్వాత పూవు పత్రిలోని ఐదు ఆకులను తీసుకుని వాటికి పసుపు పూసి దారంతో చేయికి కట్టుకుని ఆ తర్వాత నిమజ్జనానికి పూనుకోవాలి.

ఇంట్లోని ఏదైనా తొట్టెలో చేసుకుంటే.. దాని కింద ముందు ముగ్గు వేసి, పసుపు, కుంకుమ పూలు, అక్షితలు చల్లి దానికి నమస్కారం చేసి వినాయక విగ్రహన్ని ఆ నీటిలో మెల్లగా నిమజ్జనం చేయాలి.

మీ వద్ద ఏదైన పవిత్ర జలం ఉంటే కూడా ఈ నీటిలో కలపవచ్చు. నిమజ్జనం చేసేటపుడు దీపాలు వెలుగుతూ ఉండాలి. దీపం కొండె క్కిన సమయంలో చేయకూడదు.

స్వామివారిని రెండు చేతులతో తీసుకోవాలి. ఇలా నదిలో లేదా చెరువులో లేదా ఇంట్లో నిమజ్జనం చేసే సమయంలో ఈ మంత్రం చదవాలి.

‘‘ శ్రీ గణేశం ఉద్వాసయామి.. శోభనార్థం పునరాగమనాయచ’’ మంత్రం చదువుతూ విగ్రహన్ని నిమజ్జనం చేయాలి.

ఏదైన బకెట్‌ లేదా తొట్టెలో నిమజ్జనం చేస్తే.. ఆ నీటిని ఏదైన మారేడు, రావి చెట్టుకు పోయాలి.

పత్రిని ఏం చేయాలి అనే సందేహం రావచ్చు. దాన్ని ఇంటి ఆవరణలో చిన్న గొయ్యి తీసి, దానికి పూజ చేస్తే సరిపోతుంది

వినాయకుడిని నిమజ్జనం చేసేటపుడు గణేషుడిని విసిరివేయకూడదు. రెండు చేతులతో పట్టుకుని చాలా జాగ్రత్తగా నిమజ్జనం చేయాలి.