పగటి పూట ఎంతసేపు నిద్రపోవాలంటే?
పగటి పూట ఎంతసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదో చాలా మందికి తెలియదు.
ఆ మాత్రం తెలుసుకోకుండానే గంటలు గంటలు నిద్రోపుతుంటారు. అసలు పగటి పూట ఎంత సమయం నిద్రపోవాలంటే?
చాలా మంది రాత్రి పూటి దాదాపు 8 గంటల పాటు నిద్రపోయినా సరే పగటిపూట కూడా నిద్రపోవడం అలవాటు ఉంటుంది.
కొందరైతే లంచ్ చేసిన తర్వాత కాస్త సమయం నిద్రపోతారు.
అయితే కొందరు మాత్రం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు గంటలు గంటలు నిద్రపోతుంటారు.
అలా నిద్రపోతే చాలా సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు.
పగటిపూట 90 నిమిషాలకు మించి నిద్రపోకూడదంట. 30-40 నిమిషాల నిద్ర ఉత్తమం.
మరీ ఎక్కువసేపు పడుకుంటే పనుల్లో చురుకుదనం తగ్గుతుందని అంటున్నారు.
రెండు గంటలకు పైగా పడుకుంటే నిద్ర స్తబ్దత తలెత్తుతుంది.
మధ్యాహ్నం 1గంట నుంచి 3గంటల్లోగా నిద్రపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
తిన్న వెంటనే నిద్రపోవద్దని సూచిస్తున్నారు. ఉదయం మేల్కొన్న 6 నుంచి 8 గంటల తర్వాత కునుకు తీయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
More
Stories
రూ.50వేల పెట్టుబడితో వ్యాపార ఐడియా
యాపిల్స్ ఎక్కువగా తింటే.. ప్రమాదమే!
పుచ్చకాయ రహస్యాలు