ఇత్తడి పాత్రలో టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే..
చాలా మందికి ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది.
కొందరికి టీ తాగనిదే ఏమీ తోచదు. రోజుకు 3,4 సార్లు టీ తాగేవారు కూడా ఉంటారు.
అయితే ఇళ్లలో టీ తయారీకి స్టీల్ లేదా సిల్వర్ పాత్రలను ఉపయోగిస్తుంటారు.
అయితే గతంలో 'టీ' తయారీకి ఎక్కువగా ఇత్తడి పాత్రలనే ఉపయోగించేవారట.
ఈ పాత్రల్లో తయారు చేసిన టీ తాగడం వల్ల ఆరోగ్యానికి, చర్మానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇత్తడి పాత్రలలో ఆహారాన్ని వండినప్పుడు లేదా టీ తయారు చేసినా రోగనిరోధక శక్తి పెరుగుతుందట. ఇత్తడి పాత్రలు మెలనిన్ ను ఉత్పత్తి చేస్తాయి.
ఇవి ఆ పాత్రల్లో తయారు చేసిన ఆహారంతో కలిసి మన శరీరంలోకి చేరుతాయి.
ఈ మెలనిన్లు సూర్యుడి నుంచి విడుదలయ్యే హానికర యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించి ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇత్తడి పాత్రల్లో చేసిన టీ తాగడం వల్ల, వంటకు ఇత్తడి పాత్రలను వాడటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి.
ఇత్తడి పాత్రలలో తయారు చేసిన టీ లో (లేదా) వండిన వంటలో జింక్ ఎక్కువగా ఉంటుంది.
ఇది శరీరంలో రక్తాన్ని పెంచడానికి, శుద్ధి చేయడానికి సహాయపడుతుంది.
More
Stories
రూ.50వేల పెట్టుబడితో వ్యాపార ఐడియా
యాపిల్స్ ఎక్కువగా తింటే.. ప్రమాదమే!
పుచ్చకాయ రహస్యాలు