శివుడు కలలో కనిపిస్తే.. ఏమి జరుగుతుంది?

పరమాత్ముడు కలలోకి రావడమంటే మాములు విషయం కాదు.

ఎంతో అదృష్టం ఉంటే తప్ప అటువంటి భాగ్యం కలగదని పండితులు తెలియజేస్తున్నారు. 

స్వామి వారిని నిత్యం కొలిచే వారికి కూడా అటువంటి భాగ్యం ఒక్కోసారి కలగదని పూర్వ జన్మ సుకృతం ఉంటుందని అంటుంటారు.

కలలో శివుడిని చూడటం వలన మీ జీవితంలో పురోగతి సాధించడంతోపాటు మీ కోరికలు నెరవేరడానికి శుభసూచకంగా చెబుతుంటారు.

మీరు మీ కుటుంబంతో కలిసి శివుడిని పూజించినట్లుగా అనిపిస్తే.. మీరు మీ పనిలో అత్యంత, అంకితభావం, చిత్తశుద్దితో నిమగ్నమై ఉన్నారనడానికి సంకేతం.

అలాంటి కల మీ కష్టాలు త్వరలో తీరుతాయని సూచిస్తుంది. 

ఇది మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, అదృష్టం తెస్తుందని అర్థం.

మీకు కలలో శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా భావించాలి. 

కలలో శివలింగాన్ని చూస్తే, మీ వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని స్వప్నశాస్త్రం చెబుతోంది. 

మీరు ఆ పనిలో విజయం సాధిస్తారని, శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని ఇది సూచిస్తుంది.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.