కాళ్లకు బంగారు పట్టీలు కాకుండా వెండి గజ్జలే ఎందుకు ధరిస్తారు..?

ఎంత ధనవంతులైనా కాళ్లకు వెండి పట్టీలనే ధరిస్తారు.

దీని వెనుక ఏదైనా శాస్త్రీయ లేదా మతపరమైన కారణం ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

అయితే వెండి పట్టీలు ధరించే సంప్రదాయం పురాతనమైనది.

వెండి శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. వెండి ఆభరణాలను ధ‌రిస్తే శ‌రీరంలోని వేడి బ‌య‌ట‌కు పోతుంది.

అందుకే పాదాలకు ఎప్పుడూ వెండిని ధరిస్తారు.

వెండి ఎప్పుడూ పాదాల వాపును కలిగించదు, పాదాలలో నొప్పి కూడా మంచిది.

అంతేకాదు వెండి శరీరాన్ని దృఢంగా మారుస్తుందని అంటారు.

ఇక సాంప్రదాయల ప్రకారం.. బంగారాన్ని సాక్షాత్తూ ల‌క్ష్మీ దేవిగా చెపుతుంటారు.

అందుకే పసిడి పట్టీలను కాళ్లకు ధరించకూడదని శాస్త్రం చెబుతుంది.

అంతేకాకుండా వెండి ప‌ట్టీలు ధ‌రించడం వల్ల న‌డుం నొప్పి, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందట.