జయం సినిమాలో సదా చెల్లెలు గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..

నితిన్, సదా ప్రధాన పాత్రల్లో 2002లో వచ్చిన జయం సినిమా ఎంత పెద్ద హిట్టో తెలియంది కాదు..

ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 

ఈ సినిమా హిట్ తర్వాత నితిన్, సదాలు వరుస సినిమాలతో బిజీగా మారారు..

ఇక ఈ చిత్రంలో సదా చెల్లెలుగా ఓ చిన్నారి చేసిన సంగతి తెలిసిందే. 

ఆ చిన్నారి క్యూట్ క్యూట్ మాటలతో ఎంతగానో ఆకట్టుకుంది. 

కీలక పాత్రలో నటించి వావ్ అనిపించింది. 

అంతేకాదు ఈ మూవీలో తన నటనతో ఏకంగా నంది అవార్డును సైతం అందుకుంది ఆ చిన్నారి.

 అసలు ఈ చిన్నారి ఎవరు.. ఆమె పేరు ఏంటో చూద్దాం..

ఆ అమ్మాయి పేరు యామిని శ్వేతా.. ఈ పాట ప్రముఖ సీరియల్ ఆర్టిస్ట్ జయలక్ష్మీ కూతురు.

యామిని శ్వేత ఇప్పుడు ఓ పాపకు తల్లిగా మారింది. 

ఆమెకు సంబంధించిన లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.