చిన్నదా, పెద్దదా.. ఏ చేప తింటే ఆరోగ్యం?

కొవ్వు ఉన్న చేపల్ని వారానికి నాలుగుసార్లు తింటే, గుండె జబ్బులు రావని ఓ పరిశోధనలో తేలింది. 

పెద్ద చేపల్లో హై డెన్సిటీ లైపోప్రోటీన్ (HDL) ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దాన్ని మంచి కొలెస్ట్రాల్ అని పిలుస్తారు.

చేపల్లో ఉండే ఒమేగా-3 ప్యాటీ యాసిడ్స్, HDLను ఆరోగ్యకరమైన కొవ్వుగా మార్చేస్తాయి. 

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మన గుండెకు ఎంతో మేలు చేస్తాయి.

పెద్ద చేపల్ని తినమని యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్రన్ ఫిన్‌లాండ్ చెబుతోంది. 

జర్నల్ మాలిక్యూలర్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ రీసెర్చ్‌లో ఈ పరిశోధన వివరాల్ని రాశారు.

ఈ పరిశోధనలో 100 మంది ఫిన్‌లాండ్ మగాళ్లు, మహిళలూ పాల్గొన్నారు. వాళ్ల వయసు 40 నుంచి 72 ఏళ్ల దాకా ఉంది.

వాళ్లను 4 గ్రూపులుగా విభజించారు. వాళ్లలో కొందరిని పెద్ద చేపలు, కొందర్ని చిన్న చేపలు తినమని చెప్పారు.

12 వారాల తర్వాత చూస్తే, పెద్ద చేపలు తిన్నవారిలో మంచి కొలెస్ట్రాల్ బాగా పెరిగింది. చిన్న చేపలు తినే వాళ్లలో ఏ మార్పూ కనిపించలేదు. 

తూకంలో తక్కువ వచ్చినప్పటికీ, పెద్ద చేపల్నే కొనడం మేలు. కావాలంటే చిన్న ముక్కలుగా కోయించుకొని, అందరూ తినవచ్చు. 

చిన్న చేపల్ని ఎన్ని కొనుక్కున్నా వాటిలో HDL ఎక్కువ లేనప్పుడు మనకు ప్రయోజనం ఎక్కువ కలగదన్నది ఈ పరిశోధన సారాంశం.