ఆలూతో దీర్ఘాయుష్షు.. ఒక్కటే కండీషన్

భారతీయుల్లో 120 కోట్ల మంది బంగాళదుంపల ప్రియులని చెప్పవచ్చు. ఇక బంగాళదుంపలు వివిధ రూపాల్లో తింటూ ఉంటారు. 

ఆలూ ప్రయోజనాలు తెలిస్తే, వాటిని మరింత ఎక్కువగా వాడుకోవడానికి వీలవుతుంది. అవేంటో చూద్దాం.

దుంపలను ఉడికించి, ఫ్రై చేసి, తురుముకుని, చిప్స్‌గా ఉపయోగిస్తున్నారు. వీటి నుంచి పంచదార కూడా తయారు చేస్తారు.

దుంపలతో చేసిన ఆహారం శక్తితోపాటూ, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

ఆలూలో పుష్కలంగా పీచు, పొటాషియం, ఇనుము, విటమిన్ సి, విటమిన్ బీ6 ఉన్నాయి.

తరుచుగా దుంపలు తినేవారికి ఏ జబ్బులూ రావనీ, అరుదుగా తినేవారు అనారోగ్యం పాలవుతున్నారని పరిశోధనల్లో తేలింది. 

ఆలూ బీపీ తగ్గిస్తుంది, మంచి ఫ్యాట్ అందిస్తుంది. ఇందులో పొటాషియం వల్ల గుండె బాగా పనిచేస్తుంది.

కండరాలు ఆరోగ్యంగా పనిచేయడానికి దుంపల్లోని పొటాషియం ఉపయోగపడుతుంది. 

బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా బంగాళదుంపలు తీసుకోవాలి. ఇందుకోసం హెర్బర్ బంగాళదుంపలను ఉపయోగించవచ్చు.

ఆలూ ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. సూక్ష్మధాతు లోపాలను సరిదిద్దుతుంది. 

బంగాళాదుంపలను ఉడకబెట్టుకొని, కూరల్లో వండుకొని తినడం బెటరనీ, ఫ్రైలు, చిప్స్ రూపంలో తినడం తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.